సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ . పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ తన కెరీర్‌లో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్స్ విషయంలో కూడా మహేష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 100 కోట్లు షేర్ సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ లో మాత్రం తగ్గేదేలే అంటుంది. మహేష్ కు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి కూడా. అయితే పాండమిక్ తరువాత కూడా సర్కారు వారి పాట ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గ్రేట్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈసినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈసినిమా 1 మిలియన్ మార్క్ ను దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ మార్క్ ను దాటి 3 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. అంతేకాదు ముందు ముందు కూడా ఈసినిమా ఇంకా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Superstar @urstrulyMahesh’s #SarkaruVaariPaata had a strong bang at USA 🔥🔥#BlockbusterSVP crosses $2.1Million Mark✅@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @MythriOfficial @14ReelsPlus
🇺🇸 Release by @FlyHighCinemas @ShlokaEnts & Classics Ent’s pic.twitter.com/JEPyv60QwD
— #BlockbusterSVP 💯 (@SVPTheFilm) May 18, 2022
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని, నదియా, నాగబాబు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. థమన్ సంగీతం.. మది సినిమాటోగ్రాఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: