కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బాలీవుడ్ మూవీ "ఛత్రపతి" లో బెల్లంకొండ కు జోడీగా సుష్రత్‌ భరూచా

Bellamkonda Sreenivas’ Chatrapathi Hindi Remake Heroine Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bellamkonda Sreenivas,Actor Bellamkonda Sreenivas,Hero Bellamkonda Sreen

బాలీవుడ్ మూవీ "ఛత్రపతి" లో బెల్లంకొండ కు జోడీగా సుష్రత్‌ భరూచా

Bellamkonda Sreenivas' Chatrapathi Hindi Remake Heroine Announced

Bellamkonda Sreenivas’ Chatrapathi Hindi Remake Heroine Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bellamkonda Sreenivas,Actor Bellamkonda Sreenivas,Hero Bellamkonda Sreen

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ యూట్యూబ్ లో భారీగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే.బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన అన్ని చిత్రాలు సైతం నార్త్ లో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ ఇప్పుడు బ్లాక్ బస్టర్ "ఛత్రపతి" హిందీ రీమేక్ "ఛత్రపతి"మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ కూడా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

పెన్ స్టూడియోస్ , పెన్ మారుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఛత్రపతి" మూవీ తెరకెక్కుతుంది. ఒరిజినల్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తనీష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సూపర్ హిట్ "ప్యార్‌ కా పంచనామా"మూవీ ఫేమ్ సుష్రత్‌ భరూచా , బెల్లంకొండ కు జోడీగా ఎంపిక అయ్యారు. మంగళవారం సుష్రత్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా "ఛత్రపతి"టీమ్‌ ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తూ సుష్రత్‌ పోస్టర్ ను రిలీజ్ చేసింది. "అల్లుడు శ్రీను "మూవీ తో బెల్లంకొండ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు వినాయక్ బెల్లంకొండ ను బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేయడం విశేషం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్