స్టార్ హీరోలపై టాలెంటెడ్ యాక్టర్ కామెంట్స్..!

Talented Actor Samuthirakhani Superb words about Star heroes

సముద్రఖని.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. మన తెలుగువాళ్లు ఒక నటుడిని ఆదరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఎంతో మంది నటులు ఉన్నారు. ప్రస్తుతం అయితే సముద్రఖని గురించి చెప్పుకోవచ్చు. సముద్రఖని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్. విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు సముద్రఖని. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టారు. మరోసారి సర్కారు వారి పాటలో తన సత్తా చూపించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్ స్టార్ హీరోలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ తనను తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. సర్కారు వారి పాట సినిమాలో విలన్ కోసం పరుశురాం పలు పేర్లను చెప్పినా ..మహేష్ బాబు నన్ను రికమెండ్ చేయడంతో ఈసినిమాలో నటించే అవకాశం దక్కింది. మహేష్ గ్రేట్ యాక్టర్. తను నటించిన మురారి సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు.. మహేష్ సినిమాలు ఎప్పుడూ మిస్ అవ్వలేదు.. మహర్షి, భరత్ అనే నేను సినిమాలు కూడా చాలాసార్లు చూశాను.. స్క్రీన్ మీద తను కనిపిస్తే తనను తప్ప ఇంకేం చూడను.. అలాంటి నన్ను ఈసినిమాలో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.. మహేష్ బాబు లాంటి స్టార్ కు విలన్ గా చేయడం అంత ఈజీ కాదు.. తనకు విలన్ గా నటించడం అనేది ఒక గిఫ్ట్ లాంటిది అని చెప్పారు.

ఇంకా ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఎన్టీఆర్ కు పొలిటికల్ నాలెడ్జ్ చాలా ఉంది. లాస్ట్ టైమ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్టీఆర్ డీఎంకే పార్టీ గెలుస్తుందని చెప్పాడు. రిజల్ట్ వచ్చిన తరువాత నేను చెప్పిందే జరిగింది అని అన్నాడు. తనతో కూర్చొని మాట్లాడుతుంటే వచ్చే ఎనర్జీ ఆ వైబ్ డిఫరెంట్ గా ఉంటుంది. రాజకీయాలపై, సమాజం గురించి మాట్లాడాలంటే ఎన్టీఆర్ తోనే మాట్లాడాలి.

అల్లు అర్జున్ గురించి చెబుతూ.. అల్లు అర్జున్ ను అన్బూ అర్జున్ అని చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరి పట్ల బన్నీ చాలా ప్రేమ చూపిస్తాడు.. అలానే కేర్ తీసుకుంటాడు. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ టైమ్ లో నా షాట్ అయిపోయిన తరువాత నేను నేలపై కూర్చున్నానని బన్నీ కూడా నాతో పాటు కూర్చున్నాడు. అంతేకాదు.. ఆ టైమ్ లో నేను ఉండే హోటల్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. మంచి ఫుడ్ వస్తుందా?లేదా? అని ఎంక్వైరీ కూడా చేసేవాడు. నా డ్రీమ్ బన్నీతో కలిసి 40-45 రోజుల పాటు షూటింగ్ లో ట్రావెల్ చేయాలని.. నా డ్రీమ్ త్వరలోనే తీరబోతుంది అని తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here