కమర్షియల్ హిట్ “దబాంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సయీ మంజ్రేకర్ , వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సయీ మంజ్రేకర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మేజర్” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సయీ మంజ్రేకర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ … మహేష్ బాబు కనిపించగానే తాను ముందు ఆయన అందం వెనుకున్న సీక్రెట్ ఏంటని అడిగాననీ , మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తుంటారనీ , ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలం అవుతున్నా.. ఇప్పటికీ అలా మెయిన్ టైన్ చేయడం గ్రేట్ అంటూ కామెంట్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: