టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. 2019లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. మధ్యలో కరోనా రావడం కూడా నిఖిల్ కు కలిసిరాలేదు. ఇక ఈఏడాది మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈనేపథ్యంలో ఈఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ2 సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో తాజాగా నిఖిల్ తన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియచేసింది. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
.@actor_Nikhil is back to work and wraps up the dubbing formalities for #Karthikeya2🤘🏻
Karthikeya is all set to take you on a mystical journey in theatres from July 22.@anupamahere @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vivekkuchibotla pic.twitter.com/bJzLtFyzdn
— People Media Factory (@peoplemediafcy) May 14, 2022
దీనితో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజీస్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా వీటీతో పాటుగా నిఖిల్ ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రంలో నిఖిల్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.