కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా టాలీవుడ్ కు రీఎంట్రీ

Prabhudeva back to back movies as Choreographer

డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , నటుడు , నిర్మాత , దర్శకుడు గా ప్రభుదేవా దక్షిణాదిభాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 2 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్నారు. పద్మశ్రీ ప్రభుదేవా ప్రస్తుతం 3కన్నడ , 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం గ్యాప్ తరువాత ప్రభుదేవా
కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “గాలి నాగేశ్వర రావు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ,సన్నీ లియోన్ కథానాయికలు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తు న్నారు. “గాలి నాగేశ్వర రావు ” మూవీ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. విష్ణు మంచు , పాయల్ లపై ప్రభుదేవా ఒక సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న”గాడ్ ఫాదర్ “మూవీ లో చిరంజీవి , సల్మాన్ ఖాన్ లపై తెరకెక్కే సాంగ్ కు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేస్తారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − one =