పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్క తన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీఎంట్రీ తరువాత పవన్ కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా అలానే రీసెంట్ గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ రీఎంట్రీలో మంచి బూస్టప్ ను ఇచ్చాను. ఇక ఇప్పుడు అందరూ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు షూటింగ్ మొదలుపెట్టడానికి ఎక్కువ టైమ్ తీసుకున్న హరిహర వీరమల్లు చిత్రయూనిట్ ఇప్పుడు మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వాలని అనుకోవట్లేదట. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు చిత్రబృందం రీసెంట్ గానే ఆ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు వెంటనే మరో కొత్త షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మే 2వ వారం నుంచి మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. పవన్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం ఆ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జూన్ చివరి కల్లా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారట.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: