బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన హారర్ మూవీ”పిశాసు”తమిళ వెర్షన్ ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పిశాచి “తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ “డిటెక్టివ్ “మూవీ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మిస్కిన్ “పిశాసు”మూవీ సీక్వెల్ ఆండ్రియా ప్రధాన పాత్రలో “పిశాసు2” తమిళ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఏప్రిల్ 29 సాయంత్రం ‘5.00’ గంటలకు “పిశాచి 2 “మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇప్పటికే ఈ చిత్రానికి ఓటీటీ నుంచి భారీగా ఆఫర్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కానీ చిత్ర బృందం థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: