చరణ్ లేకపోతే సిద్ద కు పవనే బెస్ట్ ఛాయిస్..!

Pawan Kalyan Is The Best Alternative For Ram Charan In Acharya Says Chiranjeevi,Pawan Kalyan Is The Best Alternative For Siddha In Acharya Says Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Siddha,Siddha Character In Acharya,Pawan Kalyan Is The Best Alternative For Siddha In Acharya,Power Star Pawan Kalyan Is the Alternative For Siddha In Acharya Movie,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,Ram Charan,Pooja Hegde,Koratala Siva

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఇలాంటి ప్రశ్నే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని సిద్ద పాత్రలో రామ్ చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటుంది.. మీకు ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా అని అడుగగా.. చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా న్యాయం చేస్తారు.. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. రియల్ గా ఉన్నటువంటి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ తో ఆ ఎమోషన్ న్యాచురల్ గా ఉంటుంది.. అందుకే చరణ్ ను తీసుకోవడం జరిగింది. ఒకవేళ చరణ్ కనుక చేయలేకపోయి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే బెస్ట్ ఛాయిస్. రామ్ చరణ్ తరువాత అదే ఫీల్ నాకిచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు వంద శాతం అదే ఫీల్ ఉంటుంది.. కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు.. అన్ని కుదిరిపోయాయి అలాగా” అని చెప్పుకొచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

కాాగా ఈసినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను పెంచాయి. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − eight =