కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే కొరటాల శివ, రామ్ చరణ్ కూడా పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ ఎన్టీఆర్ 30 వ సినిమా గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆచాార్య సినిమా రిలీజ్ అయిన తరువాత ఎన్టీఆర్ 30 సినిమాపై దృష్టి పెడతానని చెప్పారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి.. ఈసినిమా కోసం ప్రత్యేకమైన సెట్ రెడీ అవుతుంది.. ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరగనుంది.. త్వరలోనే నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియచేస్తాము.. జూన్ నుండి ఈసినిమా షూటింగ్ మొదలుపెడతాము అని తెలిపారు. అంతేకాదు ఈసినిమాలో హీరోయిన్ గా అలియా నటించనుంది అని ఎప్పుటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ ప్రశ్నకు ఇంతవరకూ ఏ హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదన్న క్లారిటీ ఇచ్చారు. మరి ఫైనల్ గా ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ ఏ హీరోయిన్ కు వస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: