టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకొని చాలా తక్కువ కాలంలోనే.. లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు సామ్ మల్టీటాలెంటెడ్ అని చెప్పొచ్చు. హోస్ట్ గా చేసింది. బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇలా ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదంతా నాణానికి ఒక వైపు అయితే ఈ మధ్య సమంత సోషల్ మీడియా వేదికగా బాగానే ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్య నుండి విడిపోయిన తరువాత సమంతపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దానికి తోడు సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫొటోలు ఇంకా గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచడంతో ఈమధ్య మరింత ఎక్కువైంది. ఈనేపథ్యంలో సామ్ తన సోషల్ మీడియా ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు. నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మరి సామ్ స్వీట్ వార్నింగ్ ను ట్రోలర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సామ్ పలు సినిమాలతో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీనితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఖణ్మణి రాంబో ఖతీజా సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: