ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా విషాద ఛాయలు అలుముకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది ఇండస్ట్రీ. ఈ ఏడాది.. ఈ నాలుగు నెలల కాలంలోనే సీనియర్ నడుటు శరత్, ప్రముఖ గేయ రచయిత కందికొండ, ప్రముఖ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి లాంటి వాళ్లను కోల్పోయింది పరిశ్రమ. ఇక ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. మరో సీనియర్ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా వయసు రీత్యా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య అందరికీ సుపరిచితమే. ఈయన పూర్తి పేరు మన్నవ బాలయ్య. 1930లో గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు బాలయ్య. ఎత్తుకు పై ఎత్తు అనే సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసినా కూడా ఆయన ఎన్నో సినిమాల్లో ఆయన క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 300కు పైగా చిత్రాల్లో బాలయ్య నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు బాలయ్య. అమృత ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా పలు సినిమాలను కూడా నిర్మించారు. శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం సినిమాను ఆయనే నిర్మించగా..ఆ సినిమాకు ఉత్తమ నిర్మాతగా ఆయన నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా ఊరికిచ్చిన మాట సినిమా తీయగా దానికి కూడా ఉత్తమ కథా రచయితగా బాలయ్య నంది అవార్డు అందుకున్నారు. ఇంకా ఇక దర్శకుడిగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు వంటి సినిమాలను బాలయ్య డైరెక్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: