పూజాహెగ్డే పై దిల్ రాజు ప్రశంసలు

Dil Raju Funny Comments on Pooja Hegde at Beast Telugu Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dil Raju,Producer Dil Raju,Dil Raju About Pooja Hegde,Dil Raju At Beast Press Meet,Dil Raju About Pooja Hegde in Beas Press Meet,Dil Raju Funny Comments on Pooj Hegde, Dil Raju Comments on Pooja Hegde,Beast Press Meet,Beast telugu Movie Press Meet,Pooja Hegde in Beast Movie,Beast Movie Updates,Beast Movie latest Updates,Beast Releasing on April 14th

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కోలమవు కోకిల “, “డాక్టర్ “మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “ మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానున్నాయి. సెల్వ రాఘవన్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించారు. “బీస్ట్ “ మూవీలో స్టార్ హీరో విజయ్ , పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ జంటగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బీస్ట్ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ , “అరబిక్ కుతు ” , హీరో విజయ్ గానం చేసిన సెకండ్ సింగిల్ “జాలీ ఓ జింఖానా “సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. “బీస్ట్ “ మూవీ ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రెస్ మీట్ లో పాల్గొన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. దర్శకుడు , సంగీత దర్శకుడు ,విజయ్ , పూజాహెగ్డే లపై ప్రశంసలు కురిపించారు. ఒక స్టార్ హీరోతో కమర్షియల్ అంశాలున్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీసినందుకు దర్శకుడికి హ్యాట్సాఫ్ అనీ , కేవలం రెండు సినిమాలను మాత్రమే తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ కి హీరో విజయ్ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయనీ , అనిరుధ్ కంపోజ్ చేసిన అరబిక్ కుతు సాంగ్ కు ఈ రోజున ప్రపంచం మొత్తం డాన్స్ చేస్తోందనీ , పూజ .. మన కాజా. ఆమె లెగ్గుపెడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్టే. “డీజే” , “మహర్షి”, “అల.. వైకుంఠపురములో .. “అన్నీ సూపర్ హిట్లే. ఇక “బీస్ట్” కూడా ఆల్రెడీ సూపర్ హిట్ అన్నట్టే. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో పూజ అంచలంచెలుగా ఎదుగుతోందనీ , పూజ ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు .. ఆల్ ఇండియా హీరోయిన్ .. పాన్ ఇండియా హీరోయిన్ అనీ , డాన్సుల పరంగానే కాదు , సినిమా , సినిమాకి ఆమె పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతూ పోతోంది అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + thirteen =