కొంత మంది హీరోలు వరుసగా సినిమాలు చేయకపోయినా తాము చేసే తక్కువ సినిమాల్లోనే విభిన్నత ఉండేలా చూసుకుంటారు. అలాంటి హీరోల్లో లక్ష్ కూడా ఒకడు. విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు లక్ష్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా మంచి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ ఆ మధ్య వచ్చిన ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు లక్ష్. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్ హీరోగా ధీర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టైటిల్ ను ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ఇక ఈసినిమాలో సోనియా హీరోయిన్ గా నటిస్తుండగా.. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన సాయి కార్తిక్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Dheera’s journey begins… 🔥#dheeramovie @sttvfilms #tollywood#kyathichadalavada pic.twitter.com/5Z3KwDfHjH
— Laksh Chadalavada (@itsactorlaksh) April 8, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: