క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ అయితే కొంతవరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ మధ్యలో కరోనా వల్ల.. ఇతర కారణాల వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా స్టార్ట్ అయిన తరువాతే పవన్ ఒక పక్క భీమ్లానాయక్ పూర్తి చేసి రిలీజ్ చేశాడు.. మరోపక్క క్రిష్ కూడా కొండపొలం సినిమా తీశాడు. ఫైనల్ గా చాలా గ్యాప్ తరువాత ఈసినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో పవన్ ఇప్పటివరకూ చేయని పాత్రను చేయడమే కాదు.. ఈ పాత్ర కోసం పవన్ చాలా కష్టపడుతున్న సంగతి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమాలో సాలిడ్ గా ఉండబోతుండగా.. అందుకోసం పవన్ ముందుగానే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. దీనిలో ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి తాజాగా చిత్రయూనిట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ విజువల్స్ కనిపించాయి. ఫైట్ సీక్వెన్స్ కోసం పవన్ ముందుగానే ప్రీ సెషన్స్ చేస్తున్నాడు. వీడియోను బట్టి యాక్షన్ సీక్వెన్స్ ఆదిరిపోతాయనిపిస్తుంది. ముఖ్యంగా వీడియో చివరిలో వచ్చిన షాట్ అయితే హైలెట్ గా నిలిచింది.
The skill and prowess of the heroic outlaw #HariHaraVeeraMallu @pawankalyan at his Pre-shoot session! 🤩
The Warrior’s Way ▶️ https://t.co/rlTcoFHEan
A Film by @DirKrish 🔥@AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @Juji79
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 9, 2022
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: