కింగ్ నాగార్జున మాత్రం హడావుడి లేకుండా కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. సోగ్గాడే చిన్న నాయన సినిమాకు వచ్చిన సీక్వెల్ ఇది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నాగ్ తన కొత్త సినిమా ది ఘోస్ట్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు దుబాయ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఊటీలో నేడు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈవిషయాన్ని ప్రమవీణ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mornings in Ooty are always magical 😍#TheGhost @iamnagarjuna @sonalchauhan7 @AsianSuniel #NarayanDasNarang #RamMohanRao @sharrath_marar @SVCLLP @nseplofficial #TheGhostDiaries pic.twitter.com/ubTlyD3HjM
— Praveen Sattaru (@PraveenSattaru) April 8, 2022
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: