బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్, దర్శకుడు, మహేష్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్ “దబాంగ్3” చిత్రంతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలోబాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “గని “మూవీ తో సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “గని” మూవీ 8వ తేదీ రిలీజ్ సందర్భంగా సయీ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. “గని”మూవీ లో నటించడానికి ముందు తనకు మెగా ఫ్యామిలీ గురించి తెలియదనీ , చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ ఇలా వీరంతా సపరేట్ హీరోలని అనుకున్నాననీ , అంతా ఒకే ఫ్యామిలీ హీరోలనే విషయం తెలియదనీ , ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాననీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్‌లో అల్లు అర్జున్, పవన్, రామ్‌చరణ్ అంటే ఇష్టమనీ , తెలుగు సినిమాలు కూడా చూస్తాననీ , రామ్‌చరణ్ నటించిన “మగధీర” ,అల్లు అర్జున్ “పుష్ప “, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” మూవీస్ ఎంతో బాగా నచ్చాయనీ , తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ చూస్తాననీ , టాలీవుడ్‌పై తనకు మంచి రెస్పెక్ట్ ఉందనీ , “గని” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసి ఆనందానికి లోనయ్యాననీ , అదొక ఫ్యాన్ మూవ్‌మెంట్ అనీ , “దబాంగ్ 3” మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చిందనీ , “గని “మూవీ లో మాయ పాత్రలో నటించాననీ , ఈ పాత్ర రియల్ లైఫ్‌లో తనకు చాలా దగ్గరైన పాత్ర అనీ , అందుకే కథ విన్నప్పుడు బాగా కనెక్ట్ అయ్యాననీ, వరుణ్ తేజ్‌తో కలిసి నటించడం బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అనీ , తాను అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాననీ , తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉందనీ , తనకు ఎలాంటి లిమిట్స్ లేవనీ సయీ మంజ్రేకర్ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: