‘సర్కారు వారి పాట’ థర్డ్ సింగిల్ పై థమన్ అప్ డేట్..!

Thaman Gives An Update about Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata latest Movie Updates,Sarkaru Vaari Paata News, Thaman about Sarkaru Vaari Paata Movie Updates,Thaman Updates About Sarkaru Vaari Paata,Mahesh babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu New Movie Sarkaru Vaari Paata, Hero Mahesh Babu Sarkaru Vaari Paata latest News and Updates,Sarkaru Vaari Paata Third Single,Sarkaru Vaari Paata Third Song,Sarkaru Vaari Paata 3rd Song,Thaman Gives Update on 3rd SIngle From Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Penny Song,Penny song,Sarkaru Vaari Paata Songs

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ మరోసారి స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. మే నెల 12వ తేదీన ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న నేపథ్యంలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక దానికితగ్గట్టే ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మొదట ‘కళావతి’ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆపాట వచ్చి రికార్డులు క్రియేట్ చేసిందో తెలుసు. ఆ తర్వాత వచ్చిన ‘పెన్నీ సాంగ్’ కూడా యూ ట్యూబ్‌ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో తరువాత వచ్చే పాటలపై మరింత ఆసక్తి పెరిగింది. ఈనేపథ్యంలో తాజాగా థర్డ్ సింగిల్ పై అప్ డేట్ ఇచ్చాడు థమన్. మై గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణి గారితో సెషన్ కంప్లీట్ చేశానని చెప్పాడు. దీంతో త్వరలోనే థర్డ్ సింగిల్ కూడా వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి చూద్దాం థర్డ్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారో..

కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 8 =