“ఆర్ ఆర్ ఆర్” టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ

Dil Raju Special Party For RRR Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dil Raju,Ace Producer Dil Raju,Dil Raju Movies,Dil Raju with RRR Team,Dil Raju Party with RRR Movie Team,Dil Raju Special party,RRR Success party,RRR Movie, RRR Telugu Movie,RRR Success Celebrations,RRR Success Special party,RRR Success,Dil Raju Special party to RRR Team,Dil Raju,Ram Charan,Jr NTR,SS Rajamouli, Anil Ravipudi

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ఆర్ఆర్”మూవీ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఒక్క నైజాంలోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో “ఆర్ఆర్ఆర్”మూవీ టీమ్‌కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు. దిల్ రాజు గతంలో “అఖండ” టీమ్‌కి కూడా ఇలాగే పార్టీ ఇచ్చారు . “అఖండ” మూవీ కూడా దిల్ రాజు భారీ లాభాలను తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. అయితే, “ఆర్ఆర్ఆర్” మూవీ నైజాం చరిత్రలోనే రికార్డు వసూళ్లను రాబట్టడంతో దిల్ రాజు డబుల్ ఖుషీగా ఉన్నట్లు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =