టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సినీ పరిశ్రమ ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయింది. ఇక ఇప్పుడు మరో సీనియర్ డైరెక్టర్ శరత్ నేడు మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Senior director #Sarath garu passed away. May his Soul Rest In Peace! 🙏
Our Deepest Condolences to his family & friends!!#RIP #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/1bDK6C4rYM— Telugu FilmNagar (@telugufilmnagar) April 1, 2022
కాగా చాదస్తపు మొగుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన దాదాపు సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు సినిమాలు తెరకెక్కించారు. బాలకృష్ణతో వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలు తీశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: