డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. తన తాతగారైన లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు దగ్గర నుండి ఏం నేర్చుకుందీ.. నందమూరి అభిమానులకు తను ఇవ్వగలిగింది ఏమిటనేది స్పష్టంగా తెలియజేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. తాతగారు గొప్ప నటుడు, రాజకీయ నాయకుడే కాకుండా దేశంలోని గొప్ప పౌరుడనీ , ఆయన్నుంచి ఎంతో స్ఫూర్తి పొందాననీ , మనం ఇప్పటి వరకు ఎంతో పొందాం. సమాజానికి మనం ఏదైనా చేయాలనేది, ఈ దేశ పౌరుడిగా మనం పొందిన ప్రేమని ఇతరులకు కూడా పంచాలనేది తాతగారి నుంచి నేర్చుకున్నాననీ , అయితే ఆ ప్రేమని తన అభిమానులకు ఎలా అందివ్వాలి అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటాననీ , తన కష్ట , సుఖాలలో అభిమానుల స్పందన అద్భుతమనీ , ఫ్యాన్స్ ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనేది తాతగారి నుంచి తెలుసుకున్నాననీ , వాళ్లని ఎలా సంతోషంగా ఉంచగలనంటే మంచి సినిమాలు చేయడం ద్వారానే అనేది తెలుసుకున్నాననీ , అభిమానుల సంతోషమే తనకు ముఖ్యం అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: