‘బీస్ట్’.. వీర రాఘవన్ గా ‘విజయ్’

Vijay Role in Beast Movie Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Vijay Character in Beast Movie Revealed,Vijay,Beast,Beast Movie,Beast Telugu Movie,Beast Movie Latest News,Beast Movie Updates,Beast Movie Story,Vijay Role in Beast,Vijay Character in Beast

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్నాడు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా దీనిలో భాగంగా ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో విజయ్ వీర రాఘవన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =