ప్రశాంత్ నీల్‌దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కె.జి.యఫ్ 2. ఈసినిమా 2018లో విడుదలైన కె.జి.యఫ్ 1 కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ అవుతుంది. ఇక ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది. ఈనేపథ్యంలో తమ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ను కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా తమ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన కూడా ఇచ్చారు. కె.జి.యఫ్ చాప్టర్1 సనిమా వచ్చి మూడేళ్లు అయిపోతుంది.. ఈసినిమాకు అంతులేని ప్రేమను అందించారు..ఇక ఇప్పుడు వస్తున్న కే.జి.యఫ్ 2 జర్నీ కూడా ఇంకా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాం.. ఈసినిమా మీ ప్రతి ఒక్కరికి చెందినది అందుకే ఈసినిమా ప్రమోషన్స్ లో మీరు కూడా భాగమవ్వాలి. మీరు చేసిన ఆర్ట్స్ హోర్డింగ్స్ తో ఈసినిమాను ప్రమోషన్ చేయాలనుకుంటున్నాం.. ఈసందర్భంగా రాఖీ భాయ్ కోసం మీరు చేసిన ఆర్ట్ వర్క్స్ ను మాతో షేర్ చేసుకొని ఈ పబ్లిసిటీ క్యాంపెయిన్ లో భాగమవ్వండి. మీరు లేకపోతే ఈసినిమా లేదంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్‌లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: