ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ కి మిశ్రమ స్పందన లభించినా భారికలెక్షన్స్ రాబట్టడం విశేషం. ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా హీరో ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “బాహుబలి” మూవీ తన కెరీర్ కు గేమ్ ఛేంజర్ మూవీ అనీ , ఎక్కడికి వెళ్ళినా తనను గుర్తు పడుతున్నందుకు ఆ మూవీ యే కారణమనీ , తాను ఈ స్థాయిలో ఉండడానికి “బాహుబలి “మూవీ ముఖ్య కారణం అనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: