మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అంతేకాదు ఈమధ్య కాలంలో మరో కొత్త వార్త కూడా చక్కర్లు కొట్టింది. రాజమౌళి మహేష్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రోజుకో నగరంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే దుబాయ్ లో ప్రమోషన్ కార్యక్రం పూర్తి చేసుకున్న రాజమౌళి టీమ్ ప్రస్తుతం బెంగుళూరు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజమౌళిని మహేష్ సినిమా గురించి అడిగారు రిపోర్టర్స్. మహేష్ తో చేసేది మల్టీస్టారర్ అంటూ వార్తలు వస్తున్నాయి.. అది నిజమేనా అంటూ ప్రశ్నించగా.. దానికి రాజమౌళి స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. మల్టీస్టారర్ చేయట్లేదని.. కేవలం మహేష్ మాత్రమే నటిస్తున్నాడు.. మరే స్టార్ హీరో నటించడంలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
కాగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ఇది. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు కథల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈసినిమాను విడుదల చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: