‘పుష్ప’ క్రేజ్.. 10 మంది ‘పుష్పరాజ్’ లు ఒకేసారి..!

Crazy Video of Pushpa Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pushpa The Rise,Pushpa Pushpa Raj,Blockbuster Movie Pushpa The Rise,Allu Arjun Movie Pushpa the Rise Craze,Pushpa Craxy Videos in social Media, Pushpa Crazy video shared in Social Media,Pushpa Video Goes Viral In social Media,Pushpa Box Offcie Collections,Thaggedhe Le,10 Members Dressed Like Pushpa Raj, 10 Members Dressed Like Pushpa Raj Video Goes Viral in social Media,Pushpa Team Shared the viral video,Pushpa Collected 365 crore,Pushpa Part 2 The Rule, Allu arjun Super Hit Movie Pushpa THe Rise,Allu Arjun and Rashmika In Pushpa the Rise Movie

ఇప్పట్లో ఒక సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టడమంటే మాములు విషయం కాదు. ఒక వేళ హిట్ అయినా కూడా ఆసినిమా గురించి కొద్ది రోజులు మాట్లాడుకొని తరువాత మర్చిపోతారు. కానీ పుష్ప మేనియా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అందరూ రీల్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాాజాగా ఈసినిమా చిత్రయూనిట్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే పుష్పరాజ్ క్రేజ్ ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించారు. ప‌దిమంది ఒకేసారి పుష్ప రాజ్‌లా గెటప్ లు వేసి ఓ వీధిలో తిరిగిన వీడియోను పోస్ట్ చేశారు. త‌గ్గేదే లే’ అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగుల‌ను చెబుతూ వారు న‌డుచుకుంటూ వెళుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈవీడియోను పుష్ప టీమ్ తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం రూ.365 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప-దిరూల్‌’ షూటింగ్‌ ను కూడా ప్రారంభం చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =