ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీలో చూసినా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు పెద్ద హీరోల నుండి సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లోనే చేయడానికే మేకర్స్ కూడా ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాను మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయలేనంటున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను ఒక సినిమా ఎక్కువ రోజులు చేయలేను..సినిమా మొదలుపెట్టిన 5 లేదా 6 నెలల్లో పూర్తిచేయాలి.. లేదంటే నాకు బోర్ కొట్టేస్తుంది.. పాన్ ఇండియా సినిమాను కూడా చేయలేను.. కానీ నేను చేసే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ ఎంటర్ టైన్ మెంట్స్ అందిస్తాయి. ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నందమూరి బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.. ఎప్పుడు ఈసినిమా మొదలవుతుందో చెప్పలేను.. ఎఫ్ 3 సినిమా రిలీజ్ అయిన తరువాత నాఫోకస్ మొత్తం ఈసినిమాపై ఉంటుంది.. అని చెప్పుకొచ్చారు.
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్. మే27 న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: