దాదాపు ఏడాదిగా ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు రానా అభిమాలకు కూడా భీమ్లా నాయక్ సినిమా ఫుల్ మీల్స్ ఇచ్చింది. పవన్ ను ఫుల్ మాస్ రోల్ లో చూసిన పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటూ ఉండగా.. మరోవైపు రానా కు డానియేల్ శేఖర్ లాంటి పవర్ ఫుల్ రోల్ దక్కినందుకు.. పవన్ తో పాటు రానా ను కూడా అదే రేంజ్ లో చూపించినందుకు హ్యాపీగా ఉన్నారు. అందుకే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అంతకు మించి హిట్ తో దూసుకుపోతుంది.
రిలీజ్ అయిన మూడు నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా వెళుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈమధ్య హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది.. ఈనేపథ్యంలో ఈసినిమాకు కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ మొదలైంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ను ఈ విషయం గురించి అడుగగా.. అందుకు రానా స్పందిస్తూ . “ఈ సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ముగింపు తీసుకోవాలో అక్కడే ముగింపు పడింది. అందువలన సీక్వెల్ తీసే అవకాశం ఉండకపోవచ్చనేది నా అభిప్రాయం” అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈసినిమాకు పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ సాగర్ చంద్ర. రానా చెప్పినట్టు ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది.
కాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: