కేవలం సినిమాల్లో మాత్రమే హీరోయిజం చూపిస్తే హీరోలు అయిపోరు.. అలా చేసే వారిని కేవలం రీల్ హీరోలు మాత్రమే అంటారు. కానీ రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరోలు అనిపించే నటులు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లో ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. మహేష్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే మహేష్ చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్లను చేయించి.. ఆ చిన్నారుల గుండె చప్పుడుకు కారణమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు చిన్నారుల కోసం మరో అడుగు ముందుకేశారు. చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేసే దిశగా ఇప్పటికే రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తున్న మహేష్ బాబు ఫౌండేషన్ తాజాగా ఈ సేవల్ని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేసింది. ఇక నుండి రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కూడా కలిసి మహేష్ పనిచేయనున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ చిన్నారులు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారని, కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: