రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక దాని తరువాత ఒకటి అనుకుంటూ పట్టాలెక్కించేస్తున్నాడు నాని. అందులో దసరా సినిమా కూడా ఒకటి. గత సంవత్సరం దసరా రోజు నాని ‘దసరా’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే నాని లుక్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఈసినిమాలో నాని కొత్త మేకోవర్ లో అలానే ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో తెలంగాణ గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా తాజాగా ఇవాళ ‘దసరా’ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో, హీరోయిన్స్ పై ముహూర్తం షాట్ ని చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Set to go 🔥#Dasara pic.twitter.com/hcbPOi85H6
— Nani (@NameisNani) February 16, 2022
కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: