రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్రేమకథ ఇది. ఈ మూవీ రిలీజ్‌పై గత కొన్నిరోజులుగా సస్పెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా చాలా సార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అంతేకాదు చివరకు ఈసినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఆ ప్రచారాలన్నింటికీ తెర దించుతూ రాధేశ్యామ్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ వల్ల అప్పుడు కూడా ఆగిపోయింది. ఫైనల్ గా మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రేమకావ్యంగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నేడు ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Telugu : https://t.co/2DChmhjb43
Hindi : https://t.co/lehLk0d8rL
Tamil : https://t.co/bF9kWAFxzE
Kannada : https://t.co/YdNUjE0hN0
Malayalam :https://t.co/diBBjEO1eV pic.twitter.com/IKjig0k8Yi— UV Creations (@UV_Creations) February 14, 2022
మరి ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. పాన్ ఇండియా అంటే ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి. అయితే ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో ప్రమోషన్లు మాత్రమే చేశారు మేకర్స్.. కానీ ప్రెస్ మీట్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. రిలీజ్ కు మాత్రం ఇంకా తక్కువ రోజులే ఉంది. ముందు ముందు జోరుగా ప్రమోషన్ ఏర్పాట్లు చేస్తారేమో చూడాలి.
కాగా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: