‘ఎన్టీఆర్’ తో నటించాలని కోరుకుంటున్నా..!

Alia Bhatt Wants to Work With Jr NTR Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt Movies,Alia Bhatt Bollywood Actress,Alia Bhatt Upcoming Telugu Movies,Alia Bhatt New Movie In Tollywood,Alia Bhatt Upcoming Movies,Alia Bhatt Latest Movies in Tollywood, Alia Bhatt With Jr NTR Movies,Alia Bhatt Want To Act With Jr NTR,Alia Bhatt in RRR Movie,Alia Bhatt RRR Movie Updates,Alia Bhatt Want To Join Hands With Jr NTR In Tollywood Movies, Alia Bhatt About Jr NTR,Alia Bhatt About Jr NTR Acting,JR NTR Upcoming Movie,Jr NTR Latest Updates,JR NTR Latest News,Bollywood Actress Telugu Debut,Deepika Padukone in Tollywood Movie Project K, Ananya Panday in Liger Moive,Ranam Roudra Rudhiram Movie Updates,Alia Bhatt in Ranam Roudra Rudhiram Movie updates,Alia Bhatt with Ram charan in RRR Movie,#RRR,Major Saiee M Manjrekar, #RRR,#AliaBhatt,#NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ నటనకు, ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెబుతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ సరసన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో భామ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలియా భట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ 30వ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న అలియా భట్ దీని గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తరువాత సినిమా గురించి నాతో చర్చలు జరుగుతున్నాయి.. అయితే ఇంతవరకూ ఇంకా కన్ఫామ్ కాలేదు.. నిజంగా నాకు ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది. మరి అలియానే రెడీగా ఉందంటే దాదాపు ఫిక్స్ అయిపోనట్టేనేమో. కాగా ఇప్పటికే ఎన్టీఆర్, అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. అయితే అలియా చరణ్ కు జోడీగా నటించింది. ఈసినిమా కనుక ఓకే అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాకుమరింత క్రేజ్ తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా అలియానే కాదు పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన తెలుగు సినిమాల రేంజ్ పెరగడం.. మన హీరోలు కూడా ప్రయోగాత్మక సినిమాను చేయడం.. అంతేకాదు ఈ కరోనా టైమ్ లో సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంటే మన వాళ్లు సినిమాలు రిలీజ్ చేయడమే కాదు బ్లాక్ బస్టర్లు సైతం అందుకుంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ పై పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాలీవుడ్ భామలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో దీపికా పదుకొనే, లైగర్ తో అనన్య పాండే, మేజర్ లో సయీ మంజ్రేకర్ ఇంకా పలువురు ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nineteen =