ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ సినిమా రంగానికి చెెందిన పలువురు బయోపిక్ లు వచ్చాయి. అంతేకాదు ఇంకా రాజకీయ నాయకులతో పాటు ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి క్రీడాకారుల బయోపిక్ లు కూడా వచ్చాయి. ఇక ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు ప్రకటించి కూడా చాలా కాలం అవుతుంది. అయితే ఆ బయోపిక్ గురించి ఎలాంటిఅప్ డేట్ లేదు ఇప్పటివరకూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ ఈ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని, తన కెరీర్లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నాడు సుధీర్ బాబు. కొన్ని కారణాల వల్ల ముందు ఈ సినిమాను టేకప్ చేసిన సంస్థ దీన్నుంచి తప్పుకుందని.. ఐతే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని సుధీర్ తెలిపాడు. మరి ప్రవీణ్ సత్తారే దర్శకత్వంలో వహిస్తారా.. ఆ స్థానంలోకి మరో డైరెక్టర్ ఉంటారా అన్నది చూడాలి.
కాగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గా పుల్లెల గోపీచంద్ ఎంతో ఘనత సాధించాడు. ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచి భారత్ ఘనతను ఎంతో పెంచారు. ఇక కోచ్‌గామారి తన పేరిట అకాడమీ పెట్టి సైనా, సింధు, శ్రీకాంత్ సహా ఎందరో బ్యాడ్మింటన్ స్టార్లను వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ తెరమీదికి తీసుకురానున్నారు.
ప్రస్తుతం సుధీర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మాకు చెప్పాలి సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటు నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా వీటితో పాటు ‘లూజర్’ వెబ్ సిరీస్ తీసిన అభిలాష్ రెడ్డితో తాను ఒక సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. అలాగే యాక్షన్ జానర్లో బెంచ్ మార్క్‌లా నిలిచిపోయే సినిమా కూడా ఒకటి చేయనున్నానని.. ఇంకో రెండు కథలు కూడా ఓకే చేశానని సుధీర్ బాబు తెలిపాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: