చిత్ర పరిశ్రమ సమస్యల పై చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తామనీ సీఎం జగన్ అన్నట్టుగా చిరంజీవి చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందనిచెప్పామనీ , జగన్ గారితో చర్చ ఫలప్రదం అయ్యిందనీ , దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలనీ , ఈ నెల మూడవ వారం లోపల జీవో వచ్చే అవకాశం ఉందనీ , ఎంత తొందరగా జీవో వస్తే అంత తొందరగా సినీ పరిశ్రమ ముందుకు వెళుతుందని చిరంజీవి చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
చిత్ర పరిశ్రమ కు అన్ని విధాలా అండగా ఉంటాననీ , చిత్ర పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ గారికి చిత్ర పరిశ్రమ లోని ప్రతీ ఒక్కరి తరఫున కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.కరోనా కారణంగా పలు నష్టాలకు గురి అయిన చిత్ర పరిశ్రమ కు మంచి రోజులు వచ్చినట్టే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: