సినిమా టికెట్ల రేటు పెంపు విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు మధ్య గత కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక నేడు మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈసారి జగన్ తో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జగన్ తో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలను సీఎం కు చెప్పాం.. వారు కూడా అనుకూలంగా స్పందించారు.. మరో పదిరోజుల్లో ఈసమస్యకు శుభం కార్డు పడుతుందని భావిస్తున్నామని.. ఈ నెలాఖరులోనే జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నారు. చిన్న సినిమాలకు ఐదు షోలకు అనుమతివ్వనున్నట్లు చెప్పారు. ఇది చిన్న సినిమాలకు గుడ్ న్యూస్. కమిటీతో మాట్లాడి పెద్ద సినిమాలకు కూడా ప్రత్యేక వెసలుబాటు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. వైజాగ్ లో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారని.. ఏపీలో కూడా షూటింగులు చేయాలని కోరారని చిరంజీవి తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని.. దానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పామన్నారు.
ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. మొదటగా చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన మొదటి నుంచీ చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ఇటీవల సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు వచ్చాయని.. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారని ఆయన ప్రకటించారు. వారం/పది రోజుల్లోనే ఆ శుభవార్త వస్తుందని చెప్పారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్.. మా సమస్యలు వినడానికి మాకు చాలా టైం ఇచ్చారు.. మా సమస్యలను ఆయనకు చెప్పాం.. సీఎం గారు కూడా పాజిటివ్ గా స్పందించారు. ఇక చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.. ఆయన వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజమౌళి మాట్లాడతూ.. ”జగన్ గారికి సినీ పరిశ్రమ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. మేము చెప్పినవన్నీ చాలా సహనంతో విన్నారు. పెద్ద సినిమాల కష్టాలు చిన్న సినిమాల కష్టాలు వినిపించాం. ఆయనకి మా థ్యాంక్స్. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పకుండానే అన్ని చేస్తున్నారు. సినీ పరిశ్రమ కష్టాలని ఆయన భుజాన వేసుకొని ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యు సర్” అని రాజమౌళి అన్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: