శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“#RC15 “మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రి లో ఫిబ్రవరి 10 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు జరపడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈషూటింగ్ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ తో పాటు అంజలి , శ్రీకాంత్ పాల్గొంటారు.ఈ షెడ్యూల్ లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లు, సాంగ్, ఫైట్ సీక్వెన్స్ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్ నటించిన “RRR” మార్చి 25వ తేదీన , “ఆచార్య “మూవీ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: