ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న. కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలంటే చాలా టైమ్ పడుతుంది కానీ రష్మికకు మాత్రం చాలా తక్కువ టైమే పట్టింది. ఛలో సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా వరుసగా పెద్ద బ్యానర్లు.. స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకుంది. అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉంది రష్మిక. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈభామ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భీష్మ రిలీజ్ చేసి నేటితో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఈసినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకున్నారు. మొదటిది ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది.. నాలుగేళ్ల ఛలో అని ఒక పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. ఈ జర్నీ సక్సెస్ చేసినందుకు అలానే మంచి మెమరబుల్ గా చేసినందుకు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్ కు రష్మిక మందన్న రీ ట్వీట్ చేస్తూ.. నేను టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు అవుతుంది. నా జర్నీ ని ఇంత స్పెషల్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.. ఇంకా థ్యాంక్స్ వెంకీ ఈసినిమా చేసినందుకు అని ట్వీట్ చేసింది.
TFI.. ✨
it’s been 4 years since I’ve come here and you’ve been so kind.. ❤️
Thankyou to everyone who’s made my journey so special! ❤️
Thankyou @VenkyKudumula for making this happen ❤️#happy4yearsofchalo 🌸 https://t.co/6wH6G9cm7p— Rashmika Mandanna (@iamRashmika) February 2, 2022
కాగా రీసెంట్ గానే పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇంకా శర్వానంద్ హీరోగా వస్తున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో కూడా నటిస్తుంది. ఈసినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇక బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. మరోవైపు వెంకీ కుడుముల భీష్మ సినిమాతో కూడా మరో సక్సెస్ కొట్టి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తోనే సినిమా చేసే ఛాన్స్ ను కొట్టేశాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: