జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై “తమిళ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “వాలిమై” తమిళ మూవీ తమిళ , తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నిర్మాత , దర్శకుడు , హీరో సేమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ “#THALA61″తమిళ మూవీలో అజిత్ కు జంటగా టబు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దొంగతనం నేపథ్యంలో తెరకెక్కనున్న “#THALA61″తమిళ మూవీలో ఓ సీనియర్ పోలీస్ కమీషనర్ పాత్ర ఉండడంతో ఆ పాత్ర కోసం నిర్మాత బోనీ కపూర్ నాగార్జునను సంప్రదించారనీ , నాగార్జున కు కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అజిత్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో నటించనున్న ఈ మూవీ లో పోలీస్ కమీషనర్ ముందుగా మోహన్ లాల్ ను అనుకున్నా ఫైనల్ గా నాగార్జునను ఎంపికచేశారని సమాచారం. “#THALA61″తమిళ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: