సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరెండు రోజుల్లోనే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ దాదాపు వచ్చేశాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇప్పుడు చిన్నా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ డేట్లను బుక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించగా తాజాగా మారుతి, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు. మే 20న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి.. కరోనా కరుణిస్తే అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు. మరి చూద్దాం కరోనా ఏం చేస్తుందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Macho star @YoursGopichand & @DirectorMaruthi ‘s #PakkaCommercial in theatres from May 20th, 2022!🤩
100% Pakka Entertainment Guaranteed! 🤙#PakkaCommercialOnMay20th #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official @adityamusic pic.twitter.com/QaxS7dWF6W
— GA2 Pictures (@GA2Official) February 2, 2022
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఇక రీసెంట్ గానే దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చుక్కా ముక్కా కమర్షియలే అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట అందరినీ ఆకట్టుకుంటుంది.
కాాాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరి ఇప్పటికే ఈ బ్యానర్స్ నుండి మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. మరి ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: