ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా. నగేష్ కుకుమార్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం.. నగేష్ కుకునూర్
బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత.. సుధీర్ చంద్ర
సహ నిర్మాత- శ్రావ్య వర్మ
సమర్పణ.. దిల్ రాజు
సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్
కథ
సఖి (కీర్తి సురేష్) తన గ్రామంలో చలాకీగా ఆడుతూ పాడుతూ జీవనం సాగిస్తుంటుంది. అయితే తన ఊరిలో తనకు అందరూ బ్యాడ్ లక్ అని అంటుంటారు. మరోవైపు మాజీ కల్నల్ జగపతి బాబు తన గ్రామంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి జాతీయ స్థాయిలో వారు రాణించాలని, వారిని ఛాంపియన్‌లుగా నిలబెట్టాలని ఆశిస్తుంటాడు. ఈ క్రమంలోనే సఖి చిన్న నాటి స్నేహితుడు గోలిరాజు (ఆది పినిశెట్టి) సఖిని కల్నల్ దగ్గరకు తీసుకెళతాడు. తన టాలెంట్ గురించి చెబుతాడు. ఈ నేపథ్యంలో సఖి షార్ప్ షూటర్ గా రాణించడానికి ట్రైనింగ్ ఇస్తాడు. అయితే దురదృష్టానికి మారుపేరు అయినప్పటికీ ఆమె షూటింగ్‌లో ఛాంపియన్ అవడం ద్వారా ఊరికి మంచి పేరు ఎలా తీసుకువచ్చింది ? అన్నదే కథ.
విశ్లేషణ
స్పోర్ట్స్ నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే షార్ప్ షూటర్ నేపథ్యంలో వచ్చిన సినిమా మాత్రం ఇదే అని చెప్పొచ్చు. నగేష్ కుకుమార్ కు అదే ప్లస్ పాయింట్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే డిఫరెంట్ పాయింట్ ను తీసుకున్నాడు.
మనలో టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరని.. దానికి సరైన మార్గం.. కాస్త సపోర్ట్ ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఈసినిమా ద్వారా చూపించాడు డైరెక్టర్. ప్రతి ఒక్కరూ బ్యాడ్ లక్ సఖి అంటున్నా పట్టించుకోని సఖి తను ఎంచుకున్న లక్ష్యానికి చేరడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొంది.. ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నింటిని అధిగమించి దేశం గర్వించదగ్గ షార్ప్ షూటర్ లా ఎలా ఎదిగింది.. గుడ్ లక్ సఖి అని ఎలా అనిపించుకుంది అన్న విషయాన్ని ఈసినిమాలో చూపించారు. క్రిస్ప్ రన్ టైమ్ లోనే చెప్పాలనుకున్న కథను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇక కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ లో మహానటి లాంటి క్లాసిక్ సినిమా ఒకటి చాలు తన నటన గురించి చెప్పడానికి. ఇక ఈసినిమాకు కూడా కీర్తి సురేషే ప్రధాన బలం. కీర్తి సురేష్ ఈ సినిమాలో తెలంగాణా ఊరి పిల్లగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇక కల్నల్ గా జగపతిబాబు పాత్ర కూడా ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయింది. తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక సఖికి సపోర్ట్ గా నిలిచే రామారావు పాత్రలో ఆది పినిశెట్టి.. అలానే సఖిని ఇబ్బంది పెట్టే సూరి పాత్రలో రాహుల్ రామకృష్ణ కూడా తన నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పాత్ర మేర నటించారు.
ఇక సాంకేతికి విభాాగానికి వస్తే ఈసినిమాకు సంగీతం అందించింది స్టార్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. దేవి శ్రీ మ్యూజిక్ అంటే చెప్పేదేముంది.. దానికి తగ్గట్టే ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్ మెంట్ గురించి. విలేజ్ సెట్ ను బాగా ఏర్పాటు చేశారు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎడిటింగ్ కూడా చాలా బాగా ఉంది. అనవసరమైన సన్నివేశాలు లేకుండా ఎడిట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: