బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయిన హైదరాబాదీ ఫరియా అబ్దుల్లా , ఆమూవీలో చిట్టి పాత్రలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా సూపర్ హిట్ “బంగార్రాజు “మూవీ లో ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రావణాసుర “మూవీ లో ఒక కథానాయికగా ఫరియా ఎంపిక అయ్యారు. ఫరియా కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను స్వంతం చేసుకున్న ఫరియా , వారితో ఫోటోలకు నో చెబుతున్నారు. తాజాగా ఫరియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్ తో ఫొటోస్ దిగక పోవడానికి కారణం ఒక అభిమాని అడగగా , మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో తనను కలుస్తారుకానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ లో వందమంది అభిమానులను కలుస్తాననీ , వారందరితో ఫొటోలకు ఫోజులిచ్చే ఎనర్జీ తనకు ఉందని భావిస్తున్నారా అంటూ తనకు ఫొటోలు దిగడం అంతగా ఇష్టం ఉండదు అని ఫరియా చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: