పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎలాగూ పలు భాషల్లో విడుదలవుతుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కాబట్టి స్పెషల్ ఏం లేదు. మరి ప్రభాస్ సినిమా అంటే ఏదో ఒక స్పెషాలిటి ఉంటుంది కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాను 15 ఇండియన్ లాంగ్వేజస్ తో పాటు వివిధ దేశాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20 వేల స్క్రీన్లపై విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది కాబట్టి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: