మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ భాషల ప్రేక్షకులు “పుష్ప ” మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ లో “పుష్ప: ది రైజ్ డబ్బింగ్ వెర్షన్ 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్” మూవీ లో రష్మిక అందం , అమాయకత్వం కలబోసిన పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సామీ సామీ సాంగ్ లో రష్మిక అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు.దక్షిణాది పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” మూవీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “పుష్ప “మూవీ తెచ్చిన గుర్తింపు తో తాను ఎక్కడికి వెళ్ళినా శ్రీవల్లి అని పిలుస్తున్నారనీ , ఆ పేరుతో పిలవడం ఆనందంగా ఉందనీ రష్మిక చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: