మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తరువాత కొండపొలం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తో ఉన్న ఈ గ్లింప్స్ లో కేతిక, వైష్ణవ్ మధ్య రొమాంటిక్ సీన్ ని, డైలాగ్స్ ని కూడా చూపించారు. దీంతో ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
Get Ready for a Romantic Entertainer❤️#PanjaVaisshnavTej & #Ketikasharma in a brand new love story #RangaRangaVaibhavanga 💑
A Rockstar @ThisIsDSP Musical🎹
Directed by @GIREESAAYA#RRVTitleLaunch #RRVTheFilm@SVCCofficial @BvsnP pic.twitter.com/s6JpwRsWBl
— SVCC (@SVCCofficial) January 24, 2022
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక కేతికా శర్మ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినకేతికా శర్మ ఆ తరువాత లక్ష్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రెండు సినిమాలు సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. మరి ఈసినిమా అయినా కేతికా శర్మ కు మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.