సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సాంగ్స్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ గురించి కూడా తెలిసిందే కదా. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అది కూడా వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా సోషల్ మీడియా లైవ్ ద్వారా మాట్లాడిన థమన్ భీమ్లానాయక్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భీమ్లా నాయక్ సినిమా అయినంత వరకూ నేను చూశాను.. ఈసినిమాలో పవన్ పవర్ ప్యాక్ట్ పెర్ఫామెన్స్ చూసి అందరూ స్టన్ అవుతారు.. అంతేకాదు పవన్ స్టార్ కెరీర్ లోనే భీమ్లానాయక్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కూడా చెబుతున్నారు. చూద్దాం మరి థమన్ జోస్యం ఎంతవరకూ నిజమవుతుందో..
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: