“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . “థాంక్యూ” మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాల తరువాత తనకు ఇష్టమైన ప్రపంచం గురించి చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ .. తనకు బైక్స్ , కార్స్ అంటే ఆసక్తి అనీ , తనకు ఏ మాత్రం తీరిక దొరికినా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకులను, కార్లను గురించి స్టడీ చేస్తుంటాననీ , ఒకసారితన బర్త్ డేకి నాన్న ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చారనీ , జపాన్ నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించి ఆ కారును తనకు నచ్చినట్టుగా మార్చుకున్నాననీ , కార్లు , బైకులు ఆ ప్రపంచమంటే తనకు ఇష్టం అనీ , సినిమాల తరువాత తాను ఎక్కువగా ఇష్టపడేది వాటినే అనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: