సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “83”, “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్”, “సత్యమేవ జయతే 2 ” వంటి బాలీవుడ్ మూవీస్ తో పోటీపడి “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 80 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఇప్పుడు నార్త్ లో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో అల్లు అర్జున్ జాయ్ ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆయన నటించిన మరో సినిమాని హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురము లో ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ సంస్థ దేశవ్యాప్తంగా జనవరి 26 వ తేదీ రిలీజ్ చేయనుంది. “పుష్ప “మూవీ సెకండ్ పార్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: