రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఖిలాడి’ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఇక ఈసినిమాను నేడు గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా రవితేజ తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. ఈసందర్భంగా రవితేజకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Happy Sankranthi!!#Ravanasura… very excited 😊 pic.twitter.com/wHYFuKzIMr
— Ravi Teja (@RaviTeja_offl) January 14, 2022
ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. రామ్ అనే పాత్రలో ఈసినిమాలో నటిస్తున్నాడు సుశాంత్. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: