‘రౌడీ బాయ్స్’ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ

Rowdy Boys Telugu Movie Review,Ashish,Anupama Parameswaran,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movie 2022,Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,2022 Latest Telugu Movie Reviews,Latest Movie Reviews,New Telugu Movie,New Telugu Movies 2022,Telugu Reviews,Rowdy Boys Movie Review,Rowdy Boys Review,Rowdy Boys Telugu Movie Review And Rating,Ashish Rowdy Boys,Ashish Rowdy Boys Movie,Ashish Rowdy Boys Movie Review,Ashish Rowdy Boys Review,Rowdy Boys Movie Review And Rating,Rowdy Boys Review And Rating,Rowdy Boys Rating,Rowdy Boys Movie Rating,Rowdy Boys,Rowdy Boys Movie,Rowdy Boys Telugu Movie,Rowdy Boys Movie Updates,Rowdy Boys Movie Latest Updates,Rowdy Boys Latest Updates,Rowdy Boys Update,Rowdy Boys Movie Update,Rowdy Boys Telugu Movie Updates,Rowdy Boys Telugu Movie Lates Updates,Rowdy Boys Telugu Movie Live Updates,Rowdy Boys Telugu Movie News,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movie,Ashish Movies,Ashish New Movie,Ashish Latest Movie,Rowdy Boys Movie Trailer,Rowdy Boys Trailer,Rowdy Boys Songs,Rowdy Boys Movie Songs,Rowdy Boys Public Talk,Rowdy Boys Movie Public Talk,Rowdy Boys Movie Public Talk And Public Response,Rowdy Boys Public Talk And Public Response,Rowdy Boys Public Response,Rowdy Boys Movie Public Response,Dil Raju Movies,Rowdy Boys Movie Story,Rowdy Boys Movie Live Updates,Rowdy Boys Telugu Movie News,#RowdyBoys,#Ashish,#AnupamaParameswaran

అశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరో ఆశిష్ రెడ్డి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకూ రీచ్ అయింది.. మొదటి సినిమా ఆశిష్ రెడ్డికి ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..అశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్, అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు
దర్శకత్వం.. శ్రీ హర్ష
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు.. దిల్ రాజు, శిరీష్
సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి..మది

కథ

అక్షయ్ (ఆశిష్) LIT కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) BMC మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదువుతూ ఉంటుంది. రెండు కాలేజ్ స్టూడెంట్స్ కు అస్సలు పడదు. ఈ క్రమంలో అక్షయ్ కావ్య ప్రేమలో పడతాడు. అయితే కావ్య క్లాస్ మేట్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కూడా తనను ప్రేమిస్తూ ఉంటాడు. దీంతో రెండు కాలేజీల విద్యార్థులు ఎప్పుడు ఎదురుపడినా కొట్టుకుంటూనే ఉంటారు. మరి వీరి ప్రేమకథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. ఈసినిమాపై అంత బజ్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం దిల్ రాజు. దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న సినిమా హీరో అవ్వడం.. దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ఈసినిమా కోసం ఆశిష్ రెడ్డి కూడా బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. డాన్స్ విషయంలో కానీ, యాక్షన్ విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అక్షయ్ పాత్ర ఆశిష్ కి బాగా సూట్ అయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగానే ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. అయితే ఎమోషన్ సీన్లలో కాస్త ఇంటెన్సిటీ తగ్గినట్టు అనిపించినా ముందు ముందు అది కూడా కవర్ అయిపోతుంది. మొత్తానికి మొదటిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు.

ఇదిలా ఉండగా హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ సినిమాలో కాస్త బోల్డ్ రోల్ లోనే నటించిందని చెప్పొచ్చు. ఇప్పటివరకూ తను ఇంత బోల్డ్ రోల్ లో చేయలేదు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది అన్నట్టు కాకుండా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది అనుపమా. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది కాబట్టి కొన్ని చోట్ల తన నటనతో హీరోను సైతం డామినేట్ చేసిందని చెప్పొచ్చు.

ఇక రేసు గుర్రం సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో నటించిన విక్రమ్ సహిదేవ్‌ ఆ తరువాత నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో కూడా ఒక కీలకపాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు ఈసినిమాలో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ను సొంతం చేసుకున్నాడు. మెడికల్ స్టూడెంట్ గా విక్రమ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ఇదిలా ఉండగా హుషారు లాంటి యూత్‌ఫుల్ సినిమా తీసి అప్పట్లో మంచి మార్కులే కొట్టేశాడు శ్రీహర్ష. దీంతో దిల్ రాజు తనపై పెద్ద భాద్యతనే పెట్టాడు. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుండి హీరో రావడం.. ఆ బాధ్యతను శ్రీహర్ష మీద పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక అందుకు తగ్గట్టే ఆశిష్ ను దృష్టిలో పెట్టుకొని మంచి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథను తీసుకున్నాడు. డాన్స్, యాక్షన్, కామెడీ, హీరో, హీరోయిన్లు నటించడానికి స్కోప్ అలా అన్ని అంశాలను తన కథలో ఉండేలా చూసుకున్నాడు.

ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈసినిమాకు దేవి అందించిన సంగీతం కూడా ప్రధాన బలం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మది సినిమాటోగ్రఫి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్క్రీన్ మీద సినిమా ఇంత అందంగా కనిపించడానికి కారణం మది. దిల్ రాజు నిర్మాణసంస్థ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ ను మాత్రం ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని చూడాలంటే ఈసినిమాను చూడొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =