జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంచనాలు భారీగా ఉన్న “బంగార్రాజు” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ చేపట్టనున్నారు. ఈ ప్రమోషన్స్‌లో చిత్ర ప్రధాన తారాగణం నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి పాల్గొనబోతున్నారు.”మనం” సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగార్జున , నాగ చైతన్య మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకొనడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.